
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం ఆగస్టు 01:

పేద,ధనిక తేడా లేకుండా అందరి ఆకలితీర్చే అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ లు నాణ్యత ప్రమా ణాలుగల ఆహారాన్ని సమ యపాలన పాటిస్తూ అందించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ముమ్మిడివ రంలో అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అల్పాహారం కోసం క్యాంటీన్కు వచ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా?, ఆహార పదా ర్థాల నాణ్యత ఎలా ఉంది?. ఏమైనా ఫిర్యాదులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

భోజనం భుజించడానికి వచ్చిన వారు క్యాంటీన్లో ఇంట్లో కన్నా అద్భుతంగా తయారుచేసి అందించడం జరుగుతుందని సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థా లను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు తాగు నీరు అందించే ఏర్పాట్లను చేతులు కడుక్కునే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అన్న క్యాంటీన్ పరిసరాలు పరిశు భ్రంగా ఉండాలని, అపరిశుభ్రత అనేది మచ్చు కైనా కనిపించ కూడదని ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందం మరెక్కడా లభించదన్నారు. క్యాంటీన్ లో అవస రమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యే కంగా అధికారులకు బాధ్యతలు అప్పగించడం జరిగింద న్నారు. ఆహార నాణ్యతపై అధికశాతం మంది సంతృప్తి చెందే విధంగా క్యాంటీన్ నిర్వహణ ఉండాలని ఆదేశించారు అంతంత మాత్రమే ఆదాయం ఉండి పెద్దగా ఆర్థిక స్తోమత లేని వర్కర్లంతా అన్న క్యాంటీ న్లనే ఆశ్ర యించి ఆకలి తీర్చుకుంటున్నారన్నారు.

వీరే కాదు పొట్టకూటి కోసం పల్లెల నుంచి వచ్చే రోజువారీ కూలీలు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడే ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ఉద్యోగులు ఇతరులకు అన్న క్యాంటీన్లే ఆకలి తీరుస్తున్నాయ న్నారు. అల్పాహారమైనా, భోజన మైన రూ.5 లకే అందిస్తుందన్నారు.రోడ్డు పక్క బండి వద్ద టీ తాగాలన్నా రూ .10కి తక్కువ తీసుకోవడం లేదని. అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహార మైన. మధ్యాహ్నం, రాత్రికి భోజనమైన రూ.5 కే ఇస్తున్నారన్నారు నాణ్య మైన ఆహారం ఇంత తక్కువకు ఎక్కడ దొరకదన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువు కొనే విద్యా ర్థులకూ రూ.15 కే మూడు పూటలా కడుపు నింపు తోందన్నారు ఆహార నాణ్యత పై అధిక శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారనీ. పరిశుభ్రత, నాణ్యతపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారన్నారు నిరాశ్రయులు, పూట గడవ ని నిరుపేదలు చిరు వ్యాపారులు వైద్య పరీక్షలు, చికిత్సల నిమి త్తం ఆసుపత్రులకు వచ్చే వారు వాటినే ఆశ్రయిస్తున్నారన్నారు భోజనం ప్లేట్లలో అరిటాకులు వేసి వడ్డించేలా చర్యలు తీసుకో వాలని కమిషనర్ రవివర్మకు సూచించారు హోటళ్లకు వెళ్తే అల్పాహారం రూ.50, భోజనం రూ.120కి తక్కువ లేదనీ ఆ రేట్లు చూస్తేనే వారి గుండె గుభిల్లు మంటోందనీ అదే ఇక్కడైతే రూ.5, చాలక పోతే రూ.5 ఇచ్చి మరో టోకెన్ తీసుకొని వచ్చునని ఒక్క సారైనా అన్న క్యాంటీ న్లో తిందాం అనే ఆసక్తితో వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాజేష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు రెవెన్యూ సిబ్బంది కార్యదర్శులు పాల్గొ న్నారు