ఎస్సీ ఉప వర్గీకరణ ఛైర్మన్ మిశ్రాకు జోగేష్ వినతిపత్రం.
వెనుకబాటు తనం ఆధారితంగా ప్రాధాన్య మార్కులు ఇవ్వడం లేదా రోష్టర్ పద్దతి పాటించటం ద్వారా అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్ ఫలాలు మొదటిగా అందేలా చేయాలని ఎస్సీ ఉప కులాలు ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రం అందచేసినట్లు ప్రముఖ న్యాయవాది బడుగు భాస్కర్ జోగేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయనొక పత్రికా ప్రకటన విడుదల చేసారు. బిసిలలో ఎబిసిడి వర్గీకరణ విఫలమైన కారణంగానే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం(ఎంబిసి)ఏర్పడిందని తెలిపారు.ఇప్పటికే విఫలమైన పద్ధతిని ఎస్సీ సామాజిక వర్గానికి వర్తింపజేయాలనే ప్రయత్నం సమస్యను పరిష్కరించదని అన్నారు. 59 ఉపకులాలను 4వర్గాలుగా విభజిస్తే అందరికీ సమన్యాయం అందదని వివరించారు. ఈ కార్యక్రమంలో వస్కాశ్యాంసుందర్,పిల్లి కన్నబాబు,బి.వెంకటేష్, బి.అగ్ని , పి.నాని,కుమ్మరి రమణ తదితరులు పాల్గొన్నారు.
