V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 8:

ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అం దిన భూ సంబంధిత ఫిర్యా దులు పరిష్కారం. రీ సర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డాక్టర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి అమరావతి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ సద స్సులు, ఫ్రీ ఓల్డ్ భూముల డేటా ఎంట్రీ, ఇత్యాది అంశాల పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికా రులను ఉద్దేశించి మాట్లా డుతూ రెవెన్యూ సదస్సులో అందిన ఫిర్యాదులపై గ్రామాల వారీగా నివేదికలను రూపొం దించాలన్నారు ఇప్పటికే పరిష్కరించిన కేసులపై సంబంధిత ఆర్డీవోలు ఆడిట్ చేయాలని ఆదేశించారు భూ వివాదాలకు చెక్ పెట్టే దిశగా రూపొందించిన మార్గదర్శకా లు అనుగుణంగా సమర్థవం తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సబ్జెక్టు వారీగా ఫిర్యా దులను విశ్లేషించి పరి ష్కార దిశగా చర్యలు వేగవం తం చేయాలని ఆయన స్పష్టం చేశారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని పున: ప్రారంభించనున్నదని, ఈ లోపుగా రెవెన్యూ సదస్సులో అందిన ఫిర్యాదులను రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలతో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు కోనసీమ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల లో 30 రెవిన్యూఅంశాలకు సంబo ధించి 4,212 అర్జీలు అందాయన్నారు,అసైన్డ్ ఫ్రీ ఓల్డ్ భూములు, అన్ రిజిస్టర్డ్ ఫ్రీ ఓల్డ్ భూములు, రిజిస్టర్ ఫ్రీ హోల్డ్ భూములు, గ్రామ సర్వీ సు ఈనాo భూములు, రిజిస్టర్ ఫ్రీ ఓల్డ్, ఈనాం భూములు, చుక్కల,షరతుల పట్టా భూములు డేటా ఎంట్రీ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మండ ల స్థాయిలో రెవెన్యూ సమ స్యల పరిష్కారానికి గ్రామాలు వారిగా కార్యా చరణ ప్రణాళిక రూపొందించి జాప్యాలకు తావు లేకుండా నాణ్యతతో పరిష్కార మార్గాలు సూ చించి ఎండార్స్మెంట్ చేయా లని ఆదేశించారు పరిష్కరిం చిన కేసులలో యాదృచ్ఛికం గా గ్రామానికి యాదృచ్ఛికం గా ఐదు కేసులను క్షేత్రస్థా యిలో విచారించి ఎండా ర్స్మెంట్ కచ్చితంగా ఉన్నదే లేనిది క్షుణ్ణంగా పరిశీలించా లన్నారు. ఏవైనా లోపాలు గుర్తించినట్లయితే సంబంధిత బృంద సభ్యులపై చర్యలకు ఉపక్రమించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భూవివాదాలకు చెక్ పెట్టే విధంగా తగాదాలు భూ, రహదారుల ఆక్రమణలు రికార్డులలో వ్యత్యాసాలు సరిచేయాలని ఆదేశించారు. పట్టా భూములు ప్రభుత్వ భూములు సరి హద్దులను కూడా నిర్ది ష్టంగా ఏర్పాటు చేయా లన్నారు. ఫ్రీ ఓల్డ్ భూ ములు తనిఖీ డేటా ఎంట్రీ ప్రక్రియలలో జాప్యాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేప ట్టాలన్నారు ప్రతిరోజు రెవెన్యూ అంశాలకు కొంత సమయం కేటాయించి నిర్దేశత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ అంశం ఆన్లైన్లో ప్రతి బింబించే విధంగా పటిష్టమైన చర్యలను గైకొనాలన్నారు. ప్రతి చిన్న విస్తీర్ణం కూడా ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయాలని గడువులు విధించారు. రి వెరిఫికేషన్, డేటా ఎంట్రీ లలో ఎటువంటి గ్యాప్ లు ఉండరాదన్నారు. కేసుల స్థితిగతులపై ముం దుగా క్షేత్రస్థాయిలో విచారించి అధ్యయనం చేస్తూ ఆమోద యోగ్య మైన పరిష్కార మార్గాలను అన్వేషించి పరిష్కారానికి ప్రయత్నించాల న్నారు రెవిన్యూ సదస్సుల ఫిర్యాదులు పరిష్కారంలో ప్రజా సంతృప్తి అంతిమ ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. నూటికి నూరు శాతం పరిష్కార సరళి అర్జీదారునికి సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషా oతి, కొత్తపేట ఆర్డిఓ పి శ్రీకర్, భూ పరిపాలన ఉప తాసిల్దార్ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.