ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించాలని నిర్ణయించింది. ఉ.6 నుంచి 8 గంటల వరకు విద్యార్థులతో యోగా, 8 నుంచి 9 గంటల వరకు అల్పాహారం అందజేత, 9 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత సెలవు ఇస్తారు. మరోవైపు విశాఖ జిల్లాల్లో అన్ని స్కూళ్లకు ఇవాళ సెలవు ఉంది.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపరం జూన్ 21: