
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 17:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూతన జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా నియమింప బడిన సిహెచ్ శ్రీనివాస్ పదవి బాధ్యతలను బదిలీపై వెళ్లిన కె లక్ష్మీనారాయణ నుండి మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు స్వీకరించారు.ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహు కరించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లా డుతూ ప్రజా సంబంధాల వ్యాప్తి కొరకు బహుళ మీడియా వ్యవస్థల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రచార మాధ్యమాల ద్వారా సమర్థవంతమైన ప్రచారం చేస్తూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిం చడంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు ప్రభుత్వ విధానాలు, ప్రణాళి కలు మరియు సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించిన కార్యక్రమాలపై అన్ని వర్గాల ప్రజలలో అవగాహన కల్పిస్తూ చిట్ట చివరి లబ్ధిదారుల వరకు సద్వినియోగం చేసుకు నేలా విస్తృత ప్రచారం గావించాలన్నారు ప్రాధ మికంగా ప్రభుత్వ విధా నాలు కార్యక్రమాల గురిం చి ప్రజలకు తెలియజే యడంపై ఒక వైపు ప్రచారం చేస్తూ,మరోవైపు ప్రభుత్వం తన విధానా లు మరియు కార్యక్రమా లపై ప్రజల స్పందన గురించి ప్రభుత్వానికి తెలియ జేయాల్సిన బాధ్యత సమాచార పౌర సంబంధాల శాఖ అధికా రులపై ఉందన్నారు. ఈ పదవి బాధ్యతల స్వీకర ణ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన డిఐపిఆర్ఓ కె లక్ష్మీ నారాయణ, డివిజనల్ పి ఆర్వోఒ వి వి రామిరెడ్డి సిబ్బంది నాగరాజు, నరసింహారావు పి విఘ్నేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
