
గిడ్డి ఆనంద కుమార్ శనివారం పలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు సోదరుడు గిడ్డి ఆనంద్ కుమార్ పలు గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుక అంశం పై క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం క్రిస్మస్ నూతన సంవత్సరం పేరుతో ఏర్పాటు చేసిన కేక్ కోసి వారందరికీ నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగుపల్లి గ్రామ సెవెంత్ డే చర్చ్ పాస్టర్ కడిమి సోమరాజు, రాజు , మరియు డొక్కా సీతమ్మ కాలనీ గన్నవరం గ్రామ పాస్టర్ గిడ్డి సత్యం ,లక్ష్మణ్ మందిరాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు