ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 31:

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ శుక్రవారం అల్లవరం తన పార్టీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు అమలు కాలేదు అంటూ విమర్శిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రజా జీవితాలతో ఆటలాడుతోందని, ఎన్నికల ముందు బాబు గారు ఊదరకొట్టిన సూపర్ సిక్స్ అమలు చేయలేనని చేతులెత్తేసిన పరిస్థితుల్లో ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ అన్నారు.

జగననన్న సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ, ఖచ్చితంగా చెప్పిన రోజున సంక్షేమ పథకాలను అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, బాబు గారు పేదలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ మోసం చేసి బాబు గారు సరికొత్త రికార్డు సృష్టించారని చింతా అనురాధ ఎద్దేవా చేసారు. ఇవే కాకుండా 16000 కోట్ల కరెంట్ చార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో ప్రతి చోటా ప్రజాగ్రహం వెళ్లువెత్తుతూ ఉండడంతో వారు రోజూ డైవర్షన్ పాలిటిక్స్ డ్రామా ఆడుతున్నట్లు చింతా అనురాధ ఆరోపించారు.

ప్రపంచంలోనే విజనరీ అని చెప్పుకునే బాబు గారు, దావోస్ లో పోద్దున్నే అందరికంటే ముందు సమావేశాలకు వెళ్ళినా, అక్కడి నుండి వట్టి చేతులతో తిరిగి రావడం కంటే చోద్యం ఏమన్నా ఉందా అని అనురాధ ప్రశ్నించారు.ముందు ముందు ఇంకెన్ని రకాలుగా బాబు గారు దగా చేస్తారో అని ప్రజలు భయపడుతున్నారని చెబుతూ, బాబు గారు ఇకనైనా కుంటి సాకులు మానేసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకపోతే ప్రజాగ్రహం తప్పదని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ హెచ్చరించారు.

Related Articles

మాజీ మంత్రి రజిని ఆధ్వర్యంలో జగన్ పుట్టిన రోజు వేడుక

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని, ఆధ్వర్యంలో శనివారం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అనంతరం […]

అయినవిల్లి తహాసీల్దార్ పై దాడినిఖండిస్తున్నాం:CPM కారెం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 6 అయినవిల్లి తహసీల్దార్ సి నాగ లక్ష్మమ్మ పై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డాన్ని భారత కమ్యూనిస్టు […]

ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించండి: నక్క సునీల్ రాజ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అయినవిల్లి ఫిబ్రవరి 15: ఉభయ గోదావరి ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నక్క సునీల్ రాజు కోరారు. డాక్టర్ బి […]

దివ్యాంగులకు పెద్దదిక్కుగా వెంకయ్య నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జనవరి 22: దివ్యాంగులకు పెద్దదిక్కుగా ఒంటెద్దు వెంకయ్య నాయుడు సాయ సహకారాలు మరువలేనిదని పరశురాముడు అన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]