సముద్ర తీర ప్రాంతంలో రొయ్యల చెరువులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, జనవరి 27:

సముద్ర తీర ప్రాంత ఆక్వా జోన్ మరియు ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో బ్యాకీస్ వాటర్ ప్రెస్ వాటర్ ఆక్వాచెరువులు ఉన్నది జియో కోఆర్డినేట్స్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితత్వంతో కూడిన వివరాలను ప్రొఫార్మాలు నింపి సమర్పించాలని
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు , మత్స్య అధికారులు ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి కోస్టల్ రీజియన్ జోన్ కోస్తా తీర ప్రాంత మేనేజ్మెంట్ హరిత ట్రిబ్యునల్ మరియు భూగర్భ జల శాఖ మరియు కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు కోస్టల్ ఆక్వా అధారిటీ ప్రకారం ఆక్వా చెరువుల అనుమతులు అంశాలపై సమీక్షిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెండు సార్లు సర్వే నిర్వహించినప్పటికీ మరల నిర్వహించాలన్న ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా మత్స్య , రెవెన్యూ ,
వ్యవసాయ జల వనరులు కాలుష్య నియంత్రణ సర్వే సిబ్బందితో గ్రామానికి ఒక బృందం చొప్పున నియమించి జీవో నెంబర్ 16 ప్రకారం వారం రోజు లలో సర్వే పూర్తిచేస్తూ రోజు వారి సర్వే చేసిన చెరువుల వివరాలను సేకరిస్తూ వారం రోజులు అనంతరం వివరాలన్నింటిని క్రోడీకరించి రాష్ట్ర స్థాయి కమిటీకి సమర్పించాలన్నారు. అంతర్వేది ఉత్సవాలకు నియమించిన సిబ్బందికి ఆటంకం వాటిల్లకుండా మిగతా సిబ్బందిని సర్వే బృం దాలు నియమించి ఆక్వా జోన్ ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో చెరువులు ద్వారా ఆక్వా సాగు సాగుతున్నది ఆక్వా సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆక్వా జోన్ కి సంబం ధించి కోస్తా ప్రాంత జోను, కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా చెక్ లిస్ట్ ప్రకారం నిశితముగా పరిశీలించి నివేదికలను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా సాగులో ఉన్న చెరువులకు అనుమతులు ఉన్నది లేనిది మార్గదర్శకాలు ఆచరిస్తున్నది లేనిది నివేదికలో పొందుపరిచి సమర్పించాలన్నారు. గ్రామ, మండల, డివిజన్ వారీగా ఆక్వాజోనేషన్ టైపును నిర్ధారించాలన్నారు. భూగర్భ జల శాఖ వారి మార్గదర్శకాలు ప్రకారం పంట కాలువల నదీ పరివాహక జలాలను మాత్రమే ఆక్వా సాగుకు వినియోగించాల్సిఉందని లేదా ఉప్పు నీటిని, భూగర్భ జలాలను వినియోగిస్తున్నది పరిశీలన చేసి నివేదిక సమర్పించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూత్రాల ప్రకారం పెద్ద పెద్ద ఆక్వా చెరువులకు చుట్టూ నిబంధనలను పరిశీలించాలన్నారు. కోస్టల్ ఆక్వాజోన్ అథారిటీ మార్గదర్శకాలు అనుగుణంగా జియో కోఆర్డినేట్స్ మ్యాపింగ్ , చెరువుల రన్నింగ్ కండిషన్స్ పరిశీలన చేసి వివరాలు క్షుణ్ణంగా రూపొందించి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. హరిత ట్రిబ్యునల్ నిబంధనలు అతిక్రమించినట్లు ప్రకటించిన చెరువులలో సాగులు పూర్తిగా రద్దు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఇన్చార్జ్ ఆర్డిఓలు కె.మాధవి, పి శ్రీకర్ దేవరకొండ అఖిల,జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస రావు, ఏ డి ఎల్ బి ఎస్ వర్ధన్ ,ఎఫ్ డి ఓ గోపాల కృష్ణ, అసిస్టెంట్ ఇన్స్పెక్ట ర్ ప్రసాద్, మత్స్య అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

కేంద్ర మంత్రుల ఆశీర్వాదంతో నిమ్మల ఇంటిలో నిశ్చితార్థ వేడుక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పాలకొల్లు ఆగస్టు 17: పాలకొల్లు లోని ఎస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుక సైద్యంగా […]

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 31: అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ శుక్రవారం అల్లవరం తన పార్టీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]

రెడ్డి సందీప్ ను పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ రాణి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 05: ఇటీవల మండపేటలో రోడ్డు ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వైస్సార్సీపీ నాయకులు కోప్షన్ […]

ఏపి మాస్టర్స్ చాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా చుండ్రు గోవిందరాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 26: రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ సి ఈ ఓ చుండ్రు గోవిందరాజు షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచారు.ఈనెల 21 నుండి25 […]