
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25:

కూరగాయల సాగు రైతులు తమ ఉత్పత్తులను తాజాగా వినియోగదారులకు గిట్టు బాటు ధరలకు విక్రయించు కునేందుకు వీలుగా స్థానిక రైతు బజార్లు పున:ప్రారం భించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు తెలిపారు.శనివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న రైతుబజారును ఆయన పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంకురార్పణ చేసిన రైతుబజార్లు స్థానికంగా లంక ప్రాంతాలు లేకపోవడంతో కూరగాయలు సాగు చేపట్టక నిలిచిపోయిందని ప్రస్తుతం ఆత్రేయపురం రావులపాలెం కొత్తపేట పి గన్నవరం తదితర ఎనిమిది మండలాలకు చెందిన కూరగాయల సాగు రైతులను తీసుకుని వచ్చి స్థానికంగా 55 కూరగాయలు దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వీరు ప్రతి రోజు రైతు బజారుకు ఉదయాన్నే సరుకుల చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సౌలభ్యం కల్పించడం జరిగిందన్నారు.

రైతులకు వినియోగదారులకు అనుసంధానంగా కూరగాయలు చేపలు, రొయ్యలు పీతలు, చికెన్ మటన్, బియ్యం, కిరాణా వంటి అన్ని రకాలు దుకాణాలను ప్రారంభించుకోవడం సంతోషదాయ కమన్నారు అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు విక్రయించు కునేం దుకు స్టాల్స్ ను కేటాయించడం జరిగిందన్నారు. రైతులకు అన్ని విధాలుగా రైతు బజార్లో సౌకర్యాలను కల్పించడం జరి గిందన్నారు. స్వర్గీయ మెట్ల సత్యనారాయణ రావు ఎంతో ఉన్నత ఆశయంతో ఈ యొక్క రైతు బజార్ నెలకొల్పారని తెలిపారు. ఇప్పటి వరకు కూరగాయల వ్యాపారులు గుత్తాధిపత్యంతో ధరలను ఇష్టానుసారంగా పెంచి ఏకపక్షంగా విక్రయించే వారన్నారు. ఇకపై రావు లపాలెం కొత్తపేటలో మాదిరి గానే స్థానికంగా కూడా కూరగాయల ధరలు తక్కువగా ఉండి తాజాగా లభిస్తాయని తెలిపారు కూరగాయలు పండించే రైతులకు కూడా నేరుగా గిట్టుబాటు ధరలు పొందేందుకు అవకాశం కలిగిందన్నారు రైతు బజార్ ఉంటేనే ధరలు నియంత్రణలో ఉంటాయని ఆయన తెలిపారు. గృహావసర నిత్యా సరాల న్నీ ఒకే చోట లభించే విధంగా ఈ రైతుబజార్ను పున: ప్రారంభించడం జరిగిందన్నారు

జిల్లా జాయిం ట్ కలెక్టర్ టి నిషాoతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్థానిక రైతు బజార్ను పూర్తి సౌక ర్యాలు కల్పన ద్వారా పునరుద్ధరించడం జరి గిందన్నారు పార్కింగ్ వసతులు మరుగుదొడ్లు షాపులు నవీనికరణ వంటి పనులు చేపట్టి ప్రారంభించడం జరిగిం దన్నారు. ఇకపై రైతులు తాము పండించిన కూరగాయలను విని యోగదారులకు నేరుగా విక్రయించుకోవచ్చునని తెలిపారు. ఈ బజార్ రైతులకు, వినియోగ దారులకు మధ్య నడు స్తుందని మధ్యవర్తుల జోక్యం ఉండదన్నారు. రైతులు, వినియోగదారు లు ఇద్దరూ మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా ఈ పద్ధతిని ప్రభుత్వం ఆచర ణలోకి తెచ్చిందన్నారు. అందువలన వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా, అందుబాటులో లభిస్తా యని. రైతులు కూరగాయలను తమ పొలంలో స్వయంగా పండించి విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం లేకపోవటం వలన ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారు మార్కెట్‌లో ధరలు తక్కు వగా ఉండేందుకు సహా యపడుతుందన్నారు ఈ విధానం పండించే రైతు కు, వినియోగదారుడికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.రైతు బజారు పునరుద్ధరణకు సహకరించిన ప్రజాప్రతి నిధులు అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కే మాధవి, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మెట్ల రమణ బాబు, జిల్లా ఉద్యాన అధికారి బి వి రమణ మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, ఏ జయ వెంకట లక్ష్మి తాసిల్దార్ అశోక్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.