
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి డిసెంబర్ 30:
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా సోమవారం కల్వరి క్రీస్తు ప్రార్ధన మందిరం నూతన క్యాలెండర్ మరియు కల్వరి విమోచన మహోత్సవం పోస్టర్లు ను పాస్టర్ ఆకుల మరియు సంఘ సభ్యులు సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణకు కల్వరి క్రీస్తు ప్రార్ధన మందిరం తరపున అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, ప్రసాద్, నాగరాజు, రాంజీ, మరియు ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు.