
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అంబాజీపేట జూలై 23:

పేదరికం లేని సమాజమే పి 4 ప్రధాన లక్ష్యమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిధిలోని వక్కలంక గ్రామంలో పి 4 రీవాల్యుడేషన్ సర్వే గ్రామస భలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు 20% మంది పేదలను గుర్తించి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూ సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపే యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. గ్రామంలో పూర్వపు సర్వే ద్వారా 64 మంది బంగారు కుటుం బాలను గుర్తించామని రీవాల్యుడేషన్ సర్వేలో ఆ జాబితాలో 31 మంది అనర్హులుగా తేలిందన్నారు మిగిలిన 33 మందిలో వీరిలో ఇద్దరు మరణించడం జరిగిందని మిగిలిన 31 మంది అర్హులతో పాటుగా అదేవిధంగా రీవాల్యుడేషన్ సర్వేలో మరో 17 మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేసామన్నారు. మొత్తం గ్రామంలో అర్హులను 48 మంది బంగారు కుటుం బాలను గుర్తించినట్లు వెల్లడించారు. గ్రామాలలో అత్యంత ధనికులైన 10% మంది మార్గద ర్శకులు గుర్తించి బంగారు కుటుం బాలకు దత్తతని చ్చేలా ఈ యొక్క వేదిక లను నిర్వ హించడం జరుగుతుంద న్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంగారు కుటుంబా లను గుర్తించి వారికి సహకరించాలని పి ఫోర్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. పేదరిక నిర్మూలన ప్రభుత్వ లక్ష్య మని ప్రతి సచివాలయ పరిధిలో బంగారు కుటుంబాలను గుర్తించే గురుతర బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సమాన అవకాశాలు పొందే విధంగా పి 4 పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. పేదల జీవన ప్రమాణాల్లో అట్ట డుగు స్థాయిలో ఉన్న వారిని గుర్తించి పేదరికం దూరం చేయడమే లక్ష్యంగా సచివా లయ సిబ్బంది ప్రజల్లోకి విస్తృతంగా ఈ పధకాన్ని తీసుకువెళ్లాలన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఓ మురళీకృష్ణ, తాసిల్దార్ చిన్నబాబు సర్పంచి వాసంశెట్టి రేవతి గ్రామ పెద్దలు మార్గదర్శకులు బంగారు కుటుంబాల సభ్యులు, మండల, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.