మధ్యప్రదేశ్లోని భూపాల్ లో ఓ MRI సెంటర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మొబైల్ కెమెరా ద్వారా వీడియోలు తీసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. జహంగీరాబాద్ కు చెందిన ఓ మహిళ పరీక్షల నిమిత్తం ఆ సెంటర్ కు వెళ్లింది. ఈ క్రమంలో మెను గౌను ధరించి దుస్తులు మార్చుకునే గదిలోకి పంపించారు. అక్కడ కెమెరా ఉండడాన్ని గమనించగా అప్పటికే 27 నిమిషాల వీడియో రికార్డయింది.
